కామారెడ్డి, డిసెంబరు 6
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
భారతీయ జనతా పార్టీ కామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం ముందు ఉన్న ఆ మహనీయుని విగ్రహానికి కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అంబేడ్కర్ అడుగుజాడల్లో మోది జి పాలన కొనసాగుతుందని, ఆయన కలల సాకారం కోసం బీజేపీ పాటు పడుతుందనీ అన్నారు. ఎన్నో అవమానాలు, మరెన్నో ఛీత్కారాలు ఎదుర్కొన్న ఆయనకు అవే జీవిత పాఠాలు, అవరోధాలనే అందలంగా మార్చుకున్న మహనీయుడు భారతరత్న డాక్టర్ అంబెడ్కర్ అని, భారతదేశాన్ని గణతంత్ర, ప్రజాస్వామిక రాజ్యంగా తీర్చిదిద్దేందుకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనుసరించిన కార్యాచరణ మహోన్నతమైనదనీ, ఎంతమంది ఎన్ని రకాలుగా ప్రలోభపెట్టినా విదేశీ మతాల వైపు కన్నెత్తి చూడని నిజమైన భారతీయతకు ఆయన నిలువెత్తు రూపం ఆయన అని అన్నారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.