నిజామాబాద్, డిసెంబరు 6
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు మల్లెపూల జగన్ మోహన్ గౌడ్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అహర్నిశలు కృషి చేసిన మహోన్నతమైన వ్యక్తి అంబేద్కర్ అనిచ, ఈ సమాజానికి గొప్ప రాజ్యాంగాన్ని అందించడంలో కీలక భూమిక పోషించిన జ్ఞాని మరియు న్యాయవాది వారి యొక్క ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని తెలిపారు.
కార్యక్రమంలో వసంతరావు పిల్లి శ్రీకాంత్, పులి జైపాల్, బిట్ల రవి, తుకారం, గంగారం, గంగా ప్రసాద్, ఏరేటి నారాయణ రంజిత్ తదితరులు పాల్గొన్నారు.