కామారెడ్డి, డిసెంబరు 6
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
రాష్ట్ర ప్రోహిబిషన్ ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణా రావు శనివారం కామారెడ్డి జిల్లాలో పర్యటించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 7 న ఉదయం 6.30 గంటలకు హైదరాబాద్ నుండి బయలుదేరి ఉదయం 8.30 గంటలకు జుక్కల్ నియోజక వర్గం మద్నూర్ మండల కేంద్రంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ కు ఫౌండేషన్ చేస్తారని, అనంతరం మద్నూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొంటారని తెలిపారు.
ఉదయం 11 గంటలకు జుక్కల్ మండలంలోని కౌలాస్ ఫోర్ట్ ను పరిశీలన చేస్తారని తెలిపారు. మధ్యాహ్నం 12-15 నీ.లకు నిజాం సాగర్ ప్రాజెక్ట్ ను చూస్తారని తెలిపారు. మధ్యాహ్నం 1-15 గంటలకు లింగంపేట్ నాగన్న బావినీ చూస్తారని, మధ్యాహ్నం 2 గంటలకు ఎల్లారెడ్డి నియోజక వర్గం ఏం.ఎల్. ఏ. క్యాంపు కార్యాలయం కు వెళతారని తెలిపారు. మధ్యాహ్నం 3.20 గంటలకు నాగిరెడ్డి పేట మండలం తాండూర్ త్రిలింగ రామేశ్వర స్వామి దేవాలయానికి వెళతారని, మధ్యాహ్నం 4 గంటలకు పోచారం ప్రాజెక్ట్ చూస్తారని తెలిపారు. అనంతరం తిరిగి హైదరాబాద్కు వెళతారని తెలిపారు.