కామారెడ్డి, డిసెంబరు 6
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి బాల రక్షా బంధన్ ఆఫీస్లో జిల్లా జువెనైల్ జస్టిస్ బోర్డును జిల్లా జడ్జి వర ప్రసాద్ శుక్రవారం ప్రారంభించారు. కామారెడ్డి జిల్లా ప్రారంభమైన తర్వాత మొట్టమొదటిసారిగా జువెనైల్ జస్టిస్ బోర్డును ప్రారంభించుకోవడం సంతోషకరమైన విషయం అని, చట్టంతో విభేదించబడిన పిల్లలకు ఈ కోర్టు ద్వారా న్యాయం చేకూరాలని కోరారు.
కార్యక్రమంలో అడిషనల్ జడ్జి లాల్ సింగ్ శ్రీనివాస్ నాయక్ డి ఎల్ ఎస్ ఏ సెక్రటరీ నాగరాణి, ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి సుధాకర్, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి దీక్ష, పబ్లిక్ ప్రాసక్యూటర్ అశోక్ శివరామ్, డి సి పి ఓ, డాక్టర్ స్రవంతి, స్వర్ణలత, సి డబ్ల్యూ సి మెంబర్, రమణ జేజేబి సోషల్ వర్కర్, కోర్టు సిబ్బంది, బాలరక్ష భవన్ సిబ్బంది, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.