కామారెడ్డి, జూలై 27
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మంగళవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం పక్కన గల మిస్టర్ టీ పాయింట్ హోటల్‌లో మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా అఖిల భారతీయ ప్రజా సేవా సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా జిల్లా ఇంచార్జ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు అంకం శ్యామ్ రావు మాట్లాడుతూ ఏపీజే అబ్దుల్ కలాం దేశం కోసం తన జీవితాంతం తపించిన దేశభక్తుడని అన్నారు. భారతీయ ఖ్యాతిని ప్రపంచానికి చాటిన గొప్ప శాస్త్రజ్ఞుడు అని అబ్దుల్ కలాం పురా సంస్థను స్థాపించి తనకు వచ్చే జీతాన్ని ఆ సంస్థకు ఇచ్చేవారని ఆ సంస్థతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసేవారని, వైద్యరంగంలో, పోలియో బాధితులకు పరికరాల రూపకల్పనకు ఎంతో కృషి చేశారని అన్నారు.
భారత దేశ ప్రజలను, చిన్నపిల్లలను ఎక్కువ మందిని కలిసిన మొట్టమొదటి రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ అని అందుకే ఆయనను ఫ్రీపుల్స్ ప్రెసిడెంట్ అని అంటారని అన్నారు. అబ్దుల్ కలాం పడవ నడిపే కుటుంబంలో జన్మించి పేపర్ వేసి వ్యక్తి నుండి శాస్త్రవేత్తగా, రాష్ట్రపతిగా ఉన్నతమైన స్థాయికి ఎదిగారని అన్నారు. పదవిలో ఉండి కూడా సామాన్య వ్యక్తిగా జీవించారని అన్నారు.
2005లో రాష్ట్రపతిగా ఉన్నప్పుడు సమాచార హక్కు చట్టంను జూన్ 15- 2005 నాడు భారత పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి బిల్లును ఆమోదం తెలిపారని అన్నారు. జీవితంలో కష్టాలను ఎదుర్కొన్నప్పుడే విజయాలను సాధిస్తామని ఆయన అన్న మాటలు మరువలేనివని మన జననం సాధారణమే కావచ్చు కానీ మన మరణం మాత్రం ఒక చరిత్రను సృష్టించేలా ఉండాలని వారు అన్న మాటలు నేటి యువతకు ఎంతో ఆదర్శమన్నారు.
ప్రతి ఒక్కరు అబ్దుల్ కలాంని ఆదర్శంగా తీసుకొని వారి బాటలో నడవాలని అన్నారు. కార్యక్రమంలో సమాచార హక్కు చట్టం ప్రతినిధులు ఎం.వి భాస్కర్, లక్కాకుల నరేష్, భవాని పేట సుమన్, పర్వత రావు, రాజయ్య, రాహుల్ తదితరులు పాల్గొన్నారు.