బాన్సువాడ, డిసెంబరు 6
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
రాష్ట్రంలో సమగ్ర శిక్ష ఉద్యోగులకు కేజీబీవీ ఉపాధ్యాయులను శాశ్వత ఉద్యోగులుగా నియమించాలని, తపస్ జిల్లా అధ్యక్షుడు పులగం రాఘవరెడ్డి అన్నారు. శుక్రవారం బాన్సువాడ మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ ఆవడలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.
కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి భూనేకర్ సంతోష్, లక్ష్మీపతి, భాస్కర్, శివకాంత్, కస్తూర్బా పాఠశాల ప్రిన్సిపల్ విజయలత, అఖిల, కృష్ణవేణి సిఆర్పిలు తదితరులు పాల్గొన్నారు.