ఆసియా వలస సంఘాల ఐక్యవేదిక డైరెక్టర్‌గా మంద భీంరెడ్డి

హైదరాబాద్‌, డిసెంబరు 7

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

గత ముప్పయి ఏళ్లుగా అంతర్జాతీయ వలస కార్మికుల హక్కుల కోసం పనిచేస్తున్న మైగ్రంట్‌ ఫోరం ఇన్‌ ఏసియా (ఎంఎఫ్‌ఏ) అనే ప్రముఖ సంస్థకు బోర్డు అఫ్‌ డైరెక్టర్‌ గా తెలంగాణకు చెందిన ప్రముఖ వలస కార్మిక నేత మంద భీంరెడ్డి ఎన్నికయ్యారు. థాయిలాండ్‌ దేశంలోని బ్యాంకాక్‌లో శనివారం సాయంత్రం జరిగిన ఎంఎఫ్‌ఏ సర్వ ప్రతినిధి సభలో ఎన్నికలు జరిగాయి. ఎమిగ్రంట్స్‌ వెల్ఫేర్‌ ఫోరం అనే సంస్థకు భీంరెడ్డి వ్యవస్థాపక అధ్యక్షులు.

మైగ్రెంట్‌ ఫోరం ఇన్‌ ఆసియా అనేది… వలస కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు సామాజిక న్యాయం కోసం… అట్టడుగు గ్రామ స్థాయిలో పనిచేసే (గ్రాస్‌ రూట్స్‌) సంస్థలు, కార్మిక సంఘాలు, విశ్వాస ఆధారిత సమూహాలు (ఫేత్‌ బేస్డ్‌ ఆర్గనైజేషన్స్‌), వ్యక్తిగత హోదాలో పనిచేసే న్యాయవాదుల నెట్వర్క్‌తో పని చేస్తుంది. 1994 నుండి ఎంఎఫ్‌ఏ ఆసియాలో బలీయమైన వలసదారుల హక్కుల నెట్‌వర్క్‌గా అభివృద్ధి చెందింది.

Check Also

రాష్ట్ర స్థాయి గణిత ప్రతిభా పరీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

Print 🖨 PDF 📄 eBook 📱 కామారెడ్డి, డిసెంబరు 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »