గాంధారి, డిసెంబరు 8
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న గాంధారి మండల ప్రజల కల అయిన సంఘం రేవు వంతెన నిర్మాణం త్వరలో నెరవేరబోతుంది. ఈ సందర్బంగా బ్రిడ్జి నిర్మాణానికి సంబందించిన సర్వేను ఇంజినీరింగ్ అధికారులు ఆదివారం ప్రారంభించారు. సర్వే పనులకు గాంధారి గ్రామ ప్రజలు సిబ్బందికి సహకరిస్తూ బ్రిడ్జి నిర్మాణ పనులను త్వరగా ప్రారభించాలని కోరారు.
చాలా సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న తమ కల నెరవేరుస్తున్నందుకు, ఎన్నికలకు ముందు ఇచ్చిన మాట ప్రకారం వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావుకు ధన్యవాదాలు తెలిపారు. త్వరలో సంఘం రేవు బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభం అవుతాయని గాంధారి మాజీ సర్పంచ్ సంజీవ్ యాదవ్ తెలిపారు.