కామారెడ్డి, డిసెంబరు 8
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
చుక్కాపూర్ గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహ్మద్ ఆలీ షబ్బీర్, మహమ్మద్ ఇలియాస్లు పేద ప్రజలను ఆదుకోవాలని ఆదేశాలతో బోయిని నర్సయ్య కుమార్తె కల్పన వివాహానికి మినుకూరి బ్రహ్మానందరెడ్డి పుస్తేమట్టేలు బహుకరించారు. ఈ సందర్భంగా బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ గతంలో ప్రమాదంలో జరిగి నడవలేకుండా ఉన్న నర్సయ్య కుమార్తె వివాహానికి ఈ విధంగా సహాయం చేయడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు.
అలాగే గ్రామంలో గల ప్రతి పేదింటి ఆడపిల్లకు ఒక అన్నయ్య లాగా పుస్తే మెట్టేలను ఇస్తానని వివాహం చేసుకున్న నూతన వధూవరులకు కలకాలం సుఖసంతోషాలతో ఉండాలని దీవించారు. అడగగానే కాదనకుండా పేదవారికి సహాయం చేస్తున్న బ్రహ్మానందరెడ్డికి పలువురు గ్రామస్తులు అభినందించారు.
కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు గోపాల్ రెడ్డి, కొత్తకాపు రాజిరెడ్డి, నరేష్ గౌడ్, శేఖర్ గౌడ్, బాలచంద్ర గౌడ్, మాసానిపేట నర్సయ్య, నాగి నర్సింలు, శివయ్య గారి నర్సింలు, బాలయ్య, అక్కి చంద్రం, నర్సింలు పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు.