నిజామాబాద్, డిసెంబరు 8
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
విద్యారంగ సమస్యల పరిష్కారానికై పిడిఎస్‌యు ఆధ్వర్యంలో ఈనెల 10 న జరగబోయే చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం.నరేందర్, డాక్టర్ కర్క గణేష్ అన్నారు. ఈ మేరకు ఎన్.ఆర్.భవన్ కోటగల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.
విద్యాశాఖ మంత్రిని కేటాయించాలని, రాష్ట్ర బడ్జెట్లో విద్యా రంగానికి 30 శాతం నిధులు కేటాయించాలని, విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్లతో ఈనెల 10 వ తేదీన చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలను విద్యార్థుల ఆత్మహత్యలను నివారించాలని డిమాండ్ చేశారు.
పెండిరగ్లో ఉన్న స్కాలర్షిప్, ఫీజ్ రియంబర్స్మెంట్, మెస్, కాస్మోటిక్ చార్జీల బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పీ.జీ. మరియు డిగ్రీ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులను రెగ్యులరైజ్ చేయాలని, ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. అమ్మ ఆదర్శ పాఠశాలలో అసంపూర్ణ భవన నిర్మాణాలు, గురుకుల సంక్షేమ వసతి గృహాలకు సొంత భవన నిర్మాణాలు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.
ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంగిస్తున్న కార్పోరేట్, ప్రైవేటు విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లాలోని నూతన జేఎన్టీయూ సబ్ క్యాంపస్లలో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని విద్యార్థులు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో పిడిఎస్‌యు జిల్లా ఉపాధ్యక్షులు ఎల్. అనిల్ కుమార్, జిల్లా నాయకులు మహిపాల్, నసిర్, రేహాన్, తదితరులు పాల్గొన్నారు.