కామారెడ్డి, డిసెంబరు 9
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కెసిఆర్‌పై కక్ష సాధింపు చర్యల్లో భాగంగా తెలంగాణ తల్లి విగ్రహం రూపురేఖలు మార్చి తెలంగాణ సచివాలయం ముందు నూతన విగ్రహ ఏర్పాటుకు నిరసనగా బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు రాష్ట్ర వ్యాప్తంగా పిలుపు మేరకు కామారెడ్డి నియోజకవర్గ ఇంచార్జ్ మాజీ శాసనసభ్యులు గంప గోవర్ధన్, బిఆర్‌ఎస్ పార్టీ కామారెడ్డి జిల్లా అద్యక్షులు యంకె ముజీబొద్దిన్ ఆదేశాల మేరకు సోమవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తాలో గల తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు.
నిరసన కార్యక్రమంలో బిఆర్‌ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు జూకంటి ప్రభాకర్ రెడ్డి, రామారెడ్డి మాజీ ఎంపిపి దశరథ్ రెడ్డి, సీనియర్ నాయకులు భూంరెడ్డి, కౌన్సిలర్లు నజీరోద్దిన్, గెరిగంటి లక్ష్మినారాయణ, కృష్ణాజీరావు, కాసర్ల స్వామి, పట్టణ యువజన విభాగం అధ్యక్షులు భాను ప్రసాద్, జాగృతి జిల్లా అద్యక్షులు అనంత రాములు సీనియర్ నాయకులు జగదీష్ యాదవ్, మల్లేష్ యాదవ్, సంగి మోహన్, కృష్ణయాదవ్, జెర్సీ నర్సింలు, మాజీద్, నర్సింలు, వేంకటి, రాములు, పిట్ల రాము, రాజు మరియు పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.