బాన్సువాడ, డిసెంబరు 10
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మంగళవారం సిఐటియు జిల్లా నాయకులు ఖలీల్ ఆధ్వర్యంలో సిడిపిఓకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఖలీల్ మాట్లాడుతూ అంగన్వాడీలకు ఉద్యోగ భద్రత, కనీస వేతనాలు, పిఎఫ్ ఈఎస్‌ఐ సౌకర్యం కల్పించాలన్నారు.
ఈనెల 12న హైదరాబాదులో జరిగే కార్యక్రమానికి అంగన్వాడీ టీచర్లు తరలివచ్చి విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో ప్రాజెక్టు అధ్యక్షురాలు మహాదేవి, అరుణ, స్వరూప తదితరులు పాల్గొన్నారు.