బాన్సువాడ, డిసెంబరు 10
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
బాన్సువాడ పట్టణంలోని రోడ్డు భవనాల అతిథిగృహంలో మంగళవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మలిదశ ఉద్యమకారులు మాట్లాడుతూ ఉద్యమకారులకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా 250 గజాల ఇంటి స్థలం అందించి నిర్మాణానికి ఆర్థిక సాయం అందించి ఇచ్చిన హామీని నెరవేర్చాలన్నారు.
కార్యక్రమంలో డివిజన్ ప్రధాన కార్యదర్శి ఉడుత గంగాధర్ గుప్తా, సాయిబాబా, చందు, విజయ్, బీమా నాయక్, కృష్ణ భాస్కర్ గౌడ్ సాయికుమార్, మహేష్, మారుతి, సురేష్ తదితరులు పాల్గొన్నారు.