నందిపేట్, డిసెంబరు 10
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
విద్యార్థులు మనోనిబ్బరంతో ఆటలు ఆడాలని గెలుపు ఓటమి అనేది సహజమని మండల ప్రత్యేకాధికారి జగన్నాధ చారి అన్నారు. మంగళవారం మోడల్ స్కూల్ గ్రౌండ్ లో సి ఎం కప్ పోటీలను ఆయన, మండల అభివృద్ధి అధికారి శ్రీనివాస్ రావు లు ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు బాగా ఆడి మండలం పేరు నిలబెట్టాలని కోరారు. ఆటల పోటీలలో కబ్బడి, ఖో ఖో, వాలీబాల్ పోటీలు మూడురోజుల పాటు జరుగుతాయని మండల విద్యాధికారి అవదూత గంగాధర్ చెప్పారు. పోటీలలో గెలుపొందిన జట్లకు చివరి రోజు కప్ బహుమతులు అందజేస్తామని ఆయన తెలిపారు. పోటీలలో అన్ని పాఠశాలల జట్లు, పి ఈ టి లు పాల్గొన్నారు.