కామారెడ్డి, డిసెంబరు 12
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ఇందిరమ్మ ఇళ్ల సర్వేలో లబ్ధిదారుల సమాచారాన్ని పక్కగా సేకరించి యాప్‌లో పొందూపరచాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. గురువారం కామారెడ్డి మండలం గూడెం గ్రామంలో నిర్వహిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల సర్వే తీరును కలెక్టర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఇందిరమ్మ ఇళ్ల సర్వేలో ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల పూర్తి వివరాలను సేకరించి యాప్‌లో నమోదు చేయాలని, అవసరమైన భూమి పత్రాలు, ఆహార భద్రత కార్డు, ఇంటి యజమానురాలు ఫోటో లను సేకరించాలని, తద్వారా యాప్ లో పొందుపరచాలని తెలిపారు.
సర్వేకు ఒకరోజు ముందు ఆ గ్రామంలో చాటింపు వేయించాలని తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీఓ రంగనాథ్ రావు, తహసీల్దార్ జనార్ధన్, పంచాయతీ కార్యదర్శి, లబ్ధిదారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.