కామరెడ్డి, డిసెంబరు 12
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
సమాజంలో సామాజిక సేవలు అందించడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. గురువారం స్థానిక రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్న 25 మంది బాలికలకు సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రోటరీ వరంగల్ సెంట్రల్ క్లబ్ రోటేరియన్ జూలూరు కృష్ణమూర్తి సహకారంతో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థినులకు సైకిళ్లను పంపిణీ చేయడం అభినందనీయమన్నారు.
సామాజిక సేవా దృక్పథంతో రోటరీ క్లబ్ ద్వారా విద్య, వైద్యం, పర్యావరణం వంటి అంశాలలో సమాజ చేయడం జరుగుతున్నాయని కొనియాడారు. మున్ముందు కూడా రోటరీ క్లబ్ ద్వారా సమాజ సేవలు అందించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా విద్యా శాఖాధికారి రాజు, రొటీరియన్ కోరే చంద్రమౌళి వరంగల్, జి.జ్ఞాన ప్రకాష్ అసిస్టెంట్ గవర్నర్, క్లబ్ సెక్రటరీ సత్యనారాయణ, కోశాధికారి సబ్బని కృష్ణ హరి, సీనియర్ రోటీరియన్ శ్రీశైలం, ప్రోగ్రాం చైర్మన్ పి.సత్యం, ధనుంజయ, బాలకిషన్, నాగభూషణం, డి.వి. వెంకటరాజం, భాస్కర్, జైపాల్ రేడ్డి , చంద్రశేఖర్, హెచ్.ఎన్.రెడ్డి, శంకర్, విద్యార్థినులు, తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.