నిజామాబాద్, డిసెంబరు 13
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
కొత్తగా రెవెన్యూ డిపార్ట్మెంట్ నుండి 6 రకాల సర్వీసులు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుండి 2 రకాల సర్వీసులు మరియు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, సీనియర్ సిటిజెన్ డిపార్ట్మెంట్ నుండి ఒక సర్వీసు అందుబాటులోకి వచ్చాయి అని ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్ కార్తీక్ కుమార్ తెలిపారు.
- గ్యాప్ సర్టిఫికేట్ (రెవిన్యూ)
- నేమ్ చేంజ్ అఫ్ సిటిజెన్ (రెవిన్యూ)
- లోకల్ కాండిడేట్ సర్టిఫికేట్ (రెవిన్యూ)
- మైనారిటీ సర్టిఫికేట్ (రెవిన్యూ)
- సర్టిఫికేట్ పునః జారీ (ఆదాయం, కులం) (రెవిన్యూ)
- క్రీమీ లేయర్, నాన్-క్రీమీ లేయర్ సర్టిఫికేట్ (రెవిన్యూ)
- సీనియర్ సిటిజెన్ మెయిన్టనేన్సు మోనిటరింగ్ సిస్టం అప్లికేషను
- వన్యప్రాణులచే చంపబడిన మానవ/పశువులకు పరిహారంనకు అప్లికేషను (ఫారెస్ట్)
- సామిల్/టింబర్ డిపో ఫ్రెష్, రెన్యువల్ కు అప్లికేషను (ఫారెస్ట్)
ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్ కార్తీక్ గూగుల్ మీట్ ద్వారా జిల్లా లోని మీసేవ కేంద్ర యజమానులకు నూతన సర్వీసులపై అవగాహన కల్పించారు. ఎటువంటి సంబంధిత పత్రాలు నమోదు చేయాలో తెలిపారు.
జిల్లాలోని ప్రజలందరూ ఈ నూతన సర్వీసులను వినియోగించుకోవాలని తెలిపారు. అలాగే మీ సేవ సెంటర్ కి వచ్చిన ప్రతి సిటిజన్ కి నూతన సర్వీసుల గురించి అవగాహన కల్పించాలని మీసేవ ఆపరేటర్లని ఆదేశించారు.
అలాగే ఎటువంటి తప్పులు లేకుండా అప్లికేషను చేయాలని, ప్రతి ఒక్క మీసేవ సెంటర్లో సిటిజెన్ చార్టర్ , మీసేవ ఫ్లెక్సీస్, స్టేషనరీ తప్పకుండా ఉండాలని, దరకాస్తుదారునితో దురుసుగా ప్రవర్తించవద్దని తెలిపారు. నిర్ణయించిన రుసుము కంటే ఎక్కువగా తీసుకున్నట్లయితే చర్యలు తీసుకుంటామని మీసేవ కేంద్ర యజమానులను హెచ్చరించారు.