ఆర్మూర్, డిసెంబరు 13
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళ గురుకుల డిగ్రీ కళాశాల ఆర్మూర్ విద్యార్థినిలు క్రీడల్లో తమ సత్తా చాటి గెలుపొందారు. ఈనెల 11, 12 వ తేదీలలో తెలంగాణ యూనివర్సిటీ నిర్వహించిన ఇంటర్ కాలేజ్ టోర్నమెంట్లో ఆర్మూర్ విద్యార్థినులు ఎం .అంజలి అథ్లెటిక్స్ 800 మీటర్లు మరియు లాంగ్ జంప్‌లో ద్వితీయ స్థానంలో గెలుపొందారు.
వాలీబాల్ లో నిహారిక టీం కెప్టెన్ గా వ్యవహరించిన వాలీబాల్ టీం రన్నర్ అప్ గా నిలిచి బహుమతులు సాధించారు. విద్యార్థులు సర్టిఫికెట్లతో పాటు మెడల్స్ కూడా సాధించారు. ఈ సందర్భంగా విజయం సాధించిన విద్యార్థులకు, పిడి అంజలి కి కళాశాల ప్రిన్సిపల్ డా. ఎస్. చంద్రిక అభినందనలు తెలిపారు. విద్యార్థులు క్రీడల్లో విజయం సాధించడం పట్ల అధ్యాపకులు- విద్యార్థులు, విజయం సాధించిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు.