కామారెడ్డి, డిసెంబరు 13
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ఇందిరమ్మ ఇళ్ల సర్వే పక్కాగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. శుక్రవారం బిచ్కుంద మండలం ఫత్లాపూర్ గ్రామంలో నిర్వహిస్తున్న సర్వే పనులను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తు చేసుకున్న దరఖాస్తుదారులకు ఇళ్లు ఉన్నాయో లేదో పరిశీలించాలని సూచించారు.
దరఖాస్తు చేసుకున్న వారికి ఇళ్ల నిర్మాణానికి అనువైన భూమి ఉందో లేదో తెలుసుకోవాలనీ అన్నారు. సర్వే కు ఒకరోజు ముందు గ్రామంలో టామ్ టామ్ చేయాలని తెలిపారు. సర్వే సమయంలో ఇందిరమ్మ కమిటీ సభ్యులు హాజరయ్యే విధంగా చూడాలని సూచించారు. లబ్ధిదారుల వివరాలు యాప్ లో పొందులరచాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బాన్స్ వాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, తహసీల్దార్ సురేష్, ఎంపీడీఓ గోపాల కృష్ణ కుమార్, మండల స్పెషల్ ఆఫీసర్ నగేష్, తదితరులు పాల్గొన్నారు.
బిచ్కుంద ఐ. టీ. ఐ. నీ పరిశీలించిన కలెక్టర్
బిచ్కుంద ఐ.టీ. ఐ. నీ జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పరిశీలించారు. నూతనంగా నిర్మిస్తున్న భవన నిర్మాణ పనులను వేగవంతంగా నిర్మించాలని ఇంజనీర్లను ఆదేశించారు. అనంతరం విద్యార్థులతో ముచ్చటిస్తూ ప్రభుత్వం యువత కోసం అనేక ట్రేడ్స్ ను ప్రవేశ పెట్టిందని, మంచిగా చదువుకొని ఉపాధి అవకాశాలను సంపాదించుకోవాలని కోరారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ కిరణ్మయి, ప్రిన్సిపాల్ ప్రమోద్ కుమార్, తదితరులు ఉన్నారు.