సంక్రాంతి తరువాత రైతు భరోసా విడుదల చేస్తాం…

నిజాంసాగర్‌, డిసెంబరు 13

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు వస్తుందో అలాంటి పనులకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర భారీ నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అన్నారు. శుక్రవారం నిజాం సాగర్‌ ప్రాజెక్ట్‌ ప్రధాన కాలువ ద్వారా రెండవ పంటలకు నీటిని ఆయన విడుదల చేసారు. ఈ సందర్భంగా నిజాంసాగర్‌ ప్రాజెక్టు ను ఆయన సందర్శించారు.

శాఖకు రూ.1.81 లక్షల కోట్లు ఖర్చు చేసినా లాభం చేకూరలేదన్నారు. పాలమూరు రంగారెడ్డికి రూ.27వేల కోట్లు ఖర్చుపెట్టినా కొత్తగా ఒక్క ఎకరాకు నీటిని అందించలేకపోయారని విమర్శించారు. రూ.లక్ష కోట్లు పెట్టి కాళేశ్వరం కడితే అది కూలిపోయిందన్నారు. కాళేశ్వరం నీటిని వినియోగించకపోయినా రాష్ట్రంలో ఎన్నడూ లేనంతగా ఈ యేడు వరి ధాన్యాన్ని 66.7 లక్షల ఎకరాల్లో 153 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం పండిరచామన్నారు.

రైతులకు ముందుగా ప్రకటించిన విధంగా సన్నలకు క్వింటాలుకు రూ.500 బోనస్‌ అందించామని స్పష్టం చేశారు. ఐదు ఏళ్లపాటు సన్నాలకు బోనస్‌ ఇస్తామని తెలిపారు. సంక్రాంతి పండుగ తర్వాత రైతులకు రైతు భరోసా విడుదల చేస్తామని చెప్పారు. రైతులకు నీటి విడుదల ఆన్‌ ఆఫ్‌ పద్ధతిలో నీటిని వినియోగించుకోవాలని తెలిపారు.

నాగమడుగును త్వరలో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. లెండి ప్రాజెక్టుపై మహారాష్ట్ర అధికారులతో చర్చలు జరిపి పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటానని తెలిపారు. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. యువతకు 10 నెలల్లో 55 వేల పోస్టులను భర్తీ చేశామని తెలిపారు. రాష్ట్రంలోని 115 కోట్ల మంది ఉచిత బస్సు సౌకర్యం పొందారని తెలిపారు. రానున్న కాలంలో రేషన్‌ ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తామని తెలిపారు.

నిజాంసాగర్‌ ప్రధాన కాలువ, డిస్ట్రిబ్యూటరీ కాల్వలకు షెట్టర్ల ఏర్పాటు కోసం నిధులివ్వాలని బోధన్‌ ఎమ్మెల్యే సుదర్శన్‌ రెడ్డి కోరారు. సమావేశంలో ఆగ్రో ఇండస్ట్రీ ఛైర్మన్‌ కాసుల బాలరాజ్‌, జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌, నీటిపారుదల శాఖ సీఈ శ్రీనివాస్‌, సబ్‌ కలెక్టర్‌ కిరణ్మయి, ఆయా శాఖల చెందిన అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

Check Also

కుమార్తె జన్మదినం సందర్భంగా రక్తదానం

Print 🖨 PDF 📄 eBook 📱 కామారెడ్డి, డిసెంబరు 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »