ఇందిరమ్మ ఇళ్ల సర్వే ప్రక్రియ సజావుగా నిర్వహించాలి

బోధన్‌, డిసెంబరు 17

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన వారికి లబ్ధి చేకూర్చేందుకు వీలుగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జరిపిస్తున్న మొబైల్‌ యాప్‌ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. బోధన్‌ పట్టణంతో పాటు, రుద్రూర్‌ మండలం సులేమాన్‌ నగర్‌ లో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల సర్వే ప్రక్రియను కలెక్టర్‌ మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సర్వేయర్లు ఇంటింటికీ తిరుగుతూ ఇందిరమ్మ ఇళ్ల పథకం కోసం ప్రజాపాలనలో దరఖాస్తులు చేసుకున్న అర్జీదారుల వివరాలను సేకరిస్తున్న తీరును పరిశీలించిన కలెక్టర్‌, వారికి సూచనలు చేశారు.

శిథిలావస్థకు చేరిన పాతకాలం నాటి ఇళ్లలో నివాసం ఉంటున్న వారు ఎవరైనా వాటి స్థానంలో కొత్త ఇళ్లను నిర్మించుకునేందుకు ముందుకు వస్తే, అలాంటి వారి వివరాలను కూడా పూర్తిస్థాయిలో సేకరించి సర్వే యాప్‌లో పొందుపర్చాలని అన్నారు. అర్హత కలిగిన కుటుంబాలకు ప్రభుత్వం ప్రాధాన్యత క్రమంలో నిరంతర ప్రక్రియగా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయనున్న దృష్ట్యా, దరఖాస్తుదారుల వివరాల నమోదులో పొరపాట్లు లేకుండా జాగ్రత్తలు పాటించాలని హితవు పలికారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఏమైనా సందేహాలు ఉంటే మున్సిపాలిటీ పరిధిలోని వారు వార్డు అధికారిని, గ్రామాల్లో ఉండే వారు పంచాయతీ కార్యదర్శిని సంప్రదించవచ్చని ఈ సందర్భంగా కలెక్టర్‌ సూచించారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 బుధవారం, డిసెంబరు 18, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయనం – హేమంత …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »