బాన్సువాడ, డిసెంబరు 17
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న సిఆర్పిలను, సమగ్ర శిక్ష ఉద్యోగులను శాశ్వత ఉద్యోగులుగా పరిగణించి వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని కోనాపూర్ కాంప్లెక్స్ ఉపాధ్యాయులు మద్దతు పలికారు.
ఈ సందర్భంగా అయ్యాల సంతోష్ మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా చాలీచాలని వేతనాలతో విధులు నిర్వహిస్తున్న సీఆర్పీలకు పే స్కేల్ వేతనంతోపాటు ఆరోగ్య భీమా కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు సంతోష్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, ప్రవీణ్, సాయిరాం, రాధా, విజయ్, హీరలాల్, శ్రీనివాస్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.