సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయాలి

కామారెడ్డి, డిసెంబరు 18

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులరైస్‌ చేయాలని గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ డిమాండ్‌ చేశారు. మొదటగా కామారెడ్డి పట్టణానికి వచ్చినటువంటి స్వతంత్ర ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణను జై గౌడ ఉద్యమం కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు రంగోల మురళి గౌడ్‌ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్‌ కార్యాలయం వద్ద చేపట్టిన సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరవధిక సమ్మెకు బుధవారం సంఫీుభావం తెలిపి తన సంపూర్ణ మద్దతును ప్రకటించారు.

2023 లో ఇదే సమగ్ర శిక్ష ఉద్యోగులు చేస్తున్న సమ్మెను విరమింపజేసిన ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఇప్పుడు వీరి సమస్యలను పరిష్కరించాలని లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా సమగ్ర శిక్ష ఉద్యోగులు పాల్గొన్నారు.

Check Also

రాష్ట్ర స్థాయి గణిత ప్రతిభా పరీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

Print 🖨 PDF 📄 eBook 📱 కామారెడ్డి, డిసెంబరు 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »