కామరెడ్డి, డిసెంబరు 18
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
బ్యాంకు లింకేజి, శ్రీనిధి రుణాల పంపిణీ త్వరితగతిన చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ ఛాంబర్‌లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌తో కలిసి సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజి, శ్రీనిధి ద్వారా అర్హత కలిగిన సంఘాలకు రుణాలను వచ్చే జనవరి 31 లోగా టార్గెట్ ప్రకారం రుణాలను పంపిణీ చేపట్టాలని తెలిపారు. 250 కోట్ల రుణాలు పంపిణీ టార్గెట్ ఉందని, లక్ష్యానికి అనుగుణంగా పంపిణీ చేయాలని తెలిపారు. అదే విధంగా రుణాల పంపిణీ తో పాటు రికవరీ వంద శాతం చేయాలని తెలిపారు.
క్షేత్ర స్థాయి సిబ్బందితో సమీక్షించాలని, రికవరుల పై ప్రత్యేక శ్రద్ధ కనబరాచాలని తెలిపారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సురేందర్, డి. పి. ఎం. రవీందర్ పాల్గొన్నారు.