కామారెడ్డి, డిసెంబరు 19
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
కామారెడ్డి పట్టణంలోని శిశురక్ష ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 4 రోజుల చిన్న బాబుకు అతి తక్కువ మందిలో ఉండే బి నెగెటివ్ ప్లేట్‌లెట్స్ అవసరం కావడంతో పేషంట్ కుటుంబసభ్యులు బీజేవైఎం జిల్లా అధ్యక్షులు నంది వేణుని నిర్వాహకులు సంప్రదించారు.
ఒక్క ఫోన్ కాల్తో వెంటనే స్పందించిన టెక్రియల్ గ్రామానికి చెందిన గడ్డమిది నరేష్ ఒక పసి ప్రాణాన్ని కాపాడాలనే ఉద్దేశంతో వెంటనే వచ్చి ప్లేట్‌లెట్స్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా గడ్డమిది నరేష్ మాట్లాడుతూ… రక్తం దానం చేస్తే మళ్లీ రక్తం వస్తుంది కానీ రక్తం అందక పోయిన ప్రాణం తిరిగి రాదు మనం చేసే రక్తదానం వలన వెలకట్టలేని విలువైన నిండు ప్రాణం రక్షించబడుతుంది.
యువత మానవత్వంతో స్వచ్ఛందంగా రక్తదానానికి ముందుకు వచ్చి ప్రాణదాతలు కావాలని తెలిపారు. కార్యక్రమంలో యువమోర్చ నాయకులు రాజేష్, భరత్, సాయి, నవీన్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.