నందిపేట్, జూలై 28
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బుధవారం నందిపేట మండలం తొండకుర్ గ్రామంలో అంగన్వాడి కేంద్రంలో మూడు గ్రామాల ఎంపీటీసీ సభ్యురాలు మద్దుల రాణి మురళి మహిళలకు పౌష్టికాహారాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గర్భిణీలకు, బాలింతలకు, ఆరోగ్య రీత్యా పౌష్టికాహారం అంగన్వాడి కేంద్రాల ద్వారా పంపిణీ చేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో అంగన్వాడి టీచర్, మహిళలు పాల్గొన్నారు.