ఆర్మూర్, జూలై 28
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బుధవారం రక్ష స్వచ్చంద సేవా సంస్థ, ఆర్మూర్ వారి ఆధ్వర్యములో ఆర్మూర్ పట్టణములోని చేనేత కాలనీలో రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటి నీరుపోశారు. నర్సరీ నుంచి దాదాపు 200 మొక్కలు తీసుకువచ్చి నాటారు. ఈ సందర్బంగా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీనివాస్ ఖాందేష్, ప్రధాన కార్యదర్శి విద్యా ప్రవీణ్ పవార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని, భావితరాలకు స్వఛ్ఛమైన ఆక్సిజన్ అందించేలా కృషి చేయాలనీ, చెట్లు వుంటే వర్షాలు సమృద్ధిగా కురుస్తాయన్నారు.
కార్యక్రమంలో కౌన్సిలర్ వనం శేఖర్, సంస్థ ప్రధాన కార్యదర్శి విద్యా ప్రవీణ్ పవార్, ఉపాధ్యక్షులు విద్యా గోపి, కోశాధికారి గొనె శ్రీధర్, కార్య నిర్వహణ కార్యదర్శి బెతు గంగాధర్, ఖాందేష్ సత్యం, తులసి పట్వారి, మీరా శ్రావణ్, చేనేత కాలనీ అధ్యక్షులు శ్రీనివాస్, కాలనీ పెద్దలు గంగాధర్, సత్య నారాయణ, గంగ పుత్ర సంఘం సభ్యులు మాడవేటి శ్యామ్, రఘునాత్, రమేష్, సంస్థ సభ్యులు దామోదర్, విష్ణు, సురేష్, సంజీవ్, స్వామి, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.