డిచ్‌పల్లి, జూలై 28
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉపకులపతి ఆచార్య డి. రవీందర్, రిజిస్ట్రార్ ఆచార్య నసీం ఆదేశానుసారం తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో బుధవారం కూడా డిగ్రీ, పీజీ, బి.ఎడ్. పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి డా. పాత నాగరాజు తెలిపారు.
ఉదయం 10 – 12 గంటల వరకు డిగ్రీ మొదటి సెమిస్టర్ రెగ్యూలర్ థియరీ పరీక్షలకు మొత్తం 14 వేల 151 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా 12 వేల 452 మంది హాజరు, 1699 మంది గైర్హాజరు అయినట్లు తెలిపారు.
పీజీ నాల్గవ, ఎనిమిదవ, పదవ సెమిస్టర్ రెగ్యూలర్ థియరీ పరీక్షలకు మొత్తం 2022 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా 1926 మంది హాజరు, 96 మంది గైర్హాజరు అయినట్లుబీ బి.ఎడ్. రెండవ సెమిస్టర్ బ్యాక్ లాగ్ థియరీ పరీక్షలకు మొత్తం 63 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా 52 మంది హాజరు, 11 మంది గైర్హాజరు అయినట్లు ఆయన తెలిపారు.
మధ్యాహ్నం 2 – 4 గంటల వరకు డిగ్రీ రెండవ సెమిస్టర్ బ్యాక్ లాగ్ థియరీ పరీక్షలకు మొత్తం 1077 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా 946 మంది హాజరు, 131 మంది గైర్హాజరు అయినట్లు, పీజీ ఆరవ సెమిస్టర్ రెగ్యూలర్ థియరీ పరీక్షలకు మొత్తం 94 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా 92 మంది హాజరు, ఇద్దరు గైర్హాజరు అయినట్లు, బి.ఎడ్. నాల్గవ సెమిస్టర్ రెగ్యూలర్ థియరీ పరీక్షలకు మొత్తం 1322 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా 1290 మంది హాజరు, 32 మంది గైర్హాజరు అయినట్లు ఆయన తెలిపారు.
ఉదయం జరిగిన డిగ్రీ పరీక్షల్లో నిజామాబాద్‌లోని సిఎస్‌ఐ డిగ్రీ కళాశాల పరీక్షా కేంద్రంలో హిందీ సబ్జెక్ట్‌లో ఒకరు మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడుతూ డిబార్ అయినట్లు ఆయన తెలిపారు.