మోర్తాడ్, జూలై 29
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం పాలెం ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఉచితంగా పాఠ్యపుస్తకాలను పంపిణీ చేస్తుంది. ఈ యేడాదికి సంబంధించి గురువారం ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలను పంపిణీ చేసినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తెలిపారు. ఉచిత పాఠ్యపుస్తకాలను మోర్తాడ్ మండల వైస్ ఎంపీపీ తోఘాటి శ్రీనివాస్, పాలెం గ్రామ సర్పంచ్ ఏనుగు సంతోష్ రెడ్డి పంపిణీ చేశారు.
కార్యక్రమంలో మోర్తాడ్ మండల పి ఆర్ టి యు టి ఎస్ ప్రధాన కార్యదర్శి మగ్గిడి శంకర్ పాఠశాల ఉపాధ్యాయులు ఆర్ నరసింహ స్వామి సునీల్ నచ్చ య్య ఏ గంగాధర్ శ్రీనివాసరావు బోధనేతర సిబ్బంది విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు