వేల్పూర్, జూలై 29
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని రాష్ట్ర పరిశీలకుల బృందం పరిశీలించినట్టు డాక్టర్ అశోక్ తెలిపారు. ఈ సందర్భంగా బృందం అధికారులు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం మూడు జిల్లాలను హైదరాబాద్, మేడ్చల్, నిజామాబాద్‌లను పైలెట్ జిల్లాలుగా ఎంపిక చేయడం జరిగిందని రాష్ట్ర పరిశీలకులు ఐఇసి ద్వార జాతీయ ఆరోగ్య సమాచారమును ప్రభుత్వం అందజేసిన ఐఇసి మెటీరియల్ ద్వారా ప్రజలకు జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అన్ని విషయాలపై అవగాహన కల్పించి ప్రజలకు హాస్పిటల్ ద్వారా అందించే సేవలను వివరించడం జరిగిందన్నారు.
ఈసేవల వల్ల అందుకుంటున్న లాభాలు ఉపయోగాలను ప్రజలు తెలుసుకునేలా పోస్టర్స్ బ్యానర్ ద్వారా వారికి తెలియజేయాలని ఆదేశించారు. ఇడిఇ క్యాలెండర్ వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం టిబి, లెప్రసి, ఎన్‌పిసిడిసిఎస్, ఎన్‌విబిడిసిపి, టి హబ్ ద్వారా జరిపె రక్త పరీక్షలు డెలివరీలు పిఎస్‌సి పాపులేషన్ టార్గెట్స్ అచివ్‌మెంట్స్ వేల్పూర్ దవాఖాన ద్వారా అందిస్తున్న ప్రత్యేక సర్వీసులను పరిశీలించారు. కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్ జె రాములు, రాష్ట్ర పరిశీలకులు కే శంకర్, డెమో ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.