డిచ్పల్లి, జూలై 29
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని కెమిస్ట్రీ విభాగపు పరిశోధకురాలు నీలోఫర్ రాణాకు పిహెచ్.డి. డాక్టరేట్ పట్టా ప్రదానం చేయబడిరది. కెమిస్ట్రీ విభాగపు అసోషియేట్ ప్రొఫెసర్ డా.ఎ.నాగరాజు పర్యవేక్షణలో పరిశోధక విద్యార్థి నీలోఫర్ రాణా ‘‘ద డిజైన్, సింథసిస్ ఆఫ్ నావెల్ – హెటేరో సైక్లిక్ కంపౌండ్స్ అండ్ ఎవాల్యూయేషన్ ఆఫ్ దేర్ బయోలాజికల్ ఆక్టివిటీస్’’ అనే అంశంపై పరిశోధన చేసి సిద్ధాంత గ్రంథం రూపొందించారు.
సిద్ధాంత గ్రంథం మీద జరిగిన ఓపెన్ వైవా వోస్ (వర్చువల్) ఆన్ లైన్ వేదికకు ఎక్స్ టర్నల్ ఎగ్జామినర్ రాజస్థాన్ సెంట్రల్ యూనివర్సిటీ కెమిస్ట్రీ విభాగం నుంచి ప్రొఫెసర్ ఆర్.టి. పర్దసాని హాజరై పరిశోధకురాలిని పలు ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టి సంతృప్తి వ్యక్తం చేశారు. వైవా వోస్‌కు సైన్స్ డీన్ ఆచార్య అరుణ, చైర్మన్ గా, బిఓఎస్ డా. బి.సాయిలు కన్వీనర్‌గా వ్యవహరించారు.
విభాగాధిపతి డా. జి. బాలకిషన్, తదితర కెమిస్ట్రీ విభాగపు అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు. నీలోఫర్ రాణా పిహెచ్. డి. సాధించడం పట్ల ఉపకులపతి ఆచార్య డి. రవీందర్, రిజిస్ట్రార్ ఆచార్య నసీం, ప్రిన్సిపాల్ డా. వాసం చంద్రశేఖర్, కంట్రోలర్ డా. పాత నాగరాజు, పిఆర్ఓ డా.వంగరి త్రివేణి, తదితర అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు శుభాభినందనలు తెలిపారు.