కామారెడ్డి, జనవరి 8
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ దగ్గర్లో లో గల ఈవీఎం గోడౌన్ ను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ బుధవారం సందర్శించారు. సాధారణ పరిశీలన ప్రక్రియలో భాగంగా క్షేత్రస్థాయి సందర్శన జరిపారు. ఈవీఎం గోడౌన్ కు వేసిన సీళ్లను పరిశీలించి, సీ.సీ టీ.వీలో బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, వివి.ప్యాట్లు, ఇతర ఎన్నికల సామాగ్రిని భద్రపరిచిన తీరును తనిఖీ చేశారు.
ఈవీఎం గోడౌన్ వద్ద పోలీసు బందోబస్తు తీరును పరిశీలించారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల భద్రత విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవిన్యూ) వి.విక్టర్, ఆర్డీఓ రంగనాథ్ రావు, కామారెడ్డి తహసీల్దార్ జనార్ధన్, ఎన్నికల విభాగం పర్యవేక్షకురాలు సరళ, ఎలెక్షన్ డిప్యూటీ తహసీల్దార్లు అనీల్, ఇందిరా తదితరులు ఉన్నారు.