డిచ్పల్లి, జూలై 29
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గురువారం కూడా డిగ్రీ, పీజీ, బి.ఎడ్. పరీక్షలు ప్రశాంతంగా కొనసాగినట్లు పరీక్షల నియంత్రణాధికారి డా. పాత నాగరాజు తెలిపారు. ఉదయం 10 – 12 గంటల వరకు డిగ్రీ మొదటి సెమిస్టర్ రెగ్యూలర్ థియరీ పరీక్షలకు మొత్తం 11 వేల 487 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా 10 వేల 002 మంది హాజరు, 1485 మంది గైర్హాజరు అయినట్లు తెలిపారు.
పీజీ నాల్గవ, ఎనిమిదవ, పదవ సెమిస్టర్ రెగ్యూలర్ థియరీ పరీక్షలకు మొత్తం 1972 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా 1884 మంది హాజరు, 88 మంది గైర్హాజరు అయినట్లు పేర్కొన్నారు. అదేవిధంగా బి.ఎడ్. రెండవ సెమిస్టర్ బ్యాక్ లాగ్ థియరీ పరీక్షలకు మొత్తం 17 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా 16 మంది హాజరు, 01 మంది గైర్హాజరు అయినట్లు ఆయన తెలిపారు.
మధ్యాహ్నం 2 – 4 గంటల వరకు డిగ్రీ రెండవ సెమిస్టర్ బ్యాక్ లాగ్ థియరీ పరీక్షలకు మొత్తం 3363 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా 3123 మంది హాజరు, 240 మంది గైర్హాజరు అయినట్లు తెలిపారు. పీజీ ఆరవ సెమిస్టర్ రెగ్యూలర్ థియరీ పరీక్షలకు మొత్తం 71 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా 71 మంది హాజరయ్యారన్నారు. బి.ఎడ్. నాల్గవ సెమిస్టర్ రెగ్యూలర్ థియరీ పరీక్షలకు మొత్తం 5 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా నలుగురు హాజరు, ఒకరు గైర్హాజరు అయినట్లు సివోయి తెలిపారు.
ఉదయం జరిగిన డిగ్రీ పరీక్షల్లో కామారెడ్డిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల పరీక్షా కేంద్రంలో కెమిస్ట్రీ సబ్జెక్ట్‌లో ఒకరు, మధ్యాహ్నం జరిగిన డిగ్రీ పరీక్షల్లో నిజామాబాద్‌లోని నిశిత డిగ్రీ కళాశాల పరీక్షా కేంద్రంలో అడ్వాన్స్ అకౌంటింగ్ సబ్జెక్ట్‌లో ఇద్దరు, నిజామాబాద్ లోని సిఎస్ఐ డిగ్రీ కళాశాల పరీక్షా కేంద్రంలో ఫైనాన్షియల్ అకౌంటింగ్ సబ్జెక్ట్‌లో ముగ్గురు, పొలిటికల్ సైన్స్ సబ్జెక్ట్‌లో ఒకరు, మొత్తం ఏడుగురు విద్యార్థులు మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడుతూ డిబార్ అయినట్లు ఆయన తెలిపారు.