నిజామాబాద్, జనవరి 8
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు విద్యార్థులకు అంకిత భావంతో, బాధ్యతతో విద్యా బోధన చేయాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. బుధవారం సుభాష్ నగర్ అర్బన్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో డిఇఓ, జిల్లా విద్యశాఖ ఉన్నత అధికారులతో సమీక్షా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిజామాబాదు అర్బన్ నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి ఆధ్వాన్నమైన స్థితిలో ఉన్నాయని అన్నారు. కొన్ని పాఠశాలలో ఉపాధ్యాయులు బాధ్యతగా వ్యవహరించడం లేదని, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లేదని అసహనం వ్యక్తం చేసారు.
ఉపాధ్యాయులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం, నాణ్యమైన విద్య అందకపోవడం వల్ల ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మేను ప్రకారం మిడ్డే మిల్స్ అందించాలని, నాణ్యమైన విద్య అందించాలని అన్నారు, ఇందుకు భిన్నంగా ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరించే ఉపాధ్యాయుల పైన కఠిన చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
వచ్చే విద్య సంవత్సరానికి ప్రతి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరిగే విదంగా తల్లితండ్రులలో అవగాహన కల్పించాలని, ప్రభుత్వ పాఠశాలలను మోడల్ స్కూల్స్ గా తీర్చిదిద్దేల కృషి చేయాలన్నారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన మన ఊరు మన బడి ధ్వరా వచ్చిన నిధులు వాటి వివరాలు, ప్రస్తుతం ప్రభుత్వం తీసుకొచ్చిన అమ్మఆదర్శ పాఠశాలల పథకం ధ్వరా వచ్చిన నిధులు, పనుల వివరాలు, పాఠశాలలో మౌలిక సౌకర్యాల కల్పన గురించి చర్చించారు.
కార్యక్రమంలో జిల్లా విద్య శాఖ అధికారి అశోక్ కుమార్, నార్త్, సౌత్, మండల ఎంఇవోలు, విద్యాశాఖ ప్లానింగ్ అధికారులు, సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.