కామారెడ్డి, జనవరి 9
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ఈరోజు సంక్రాంతి సంబరాలు 2025 పురస్కరించుకుని టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షులు నరాల వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో అన్ని శాఖల మహిళా ఉద్యోగులకు రంగవల్లుల పోటీలు నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ శ్రీ అసిస్ సంగ్వాన్ గారు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
అలాగే అడిషనల్ కలెక్టర్ విక్టర్, జిల్లా అధికారులు, జిల్లా కార్యవర్గం పాల్గొన్నారు. మహిళా ఉద్యోగులకు ముగ్గుల పోటీలు నిర్వహించినందున, న్యాయ నిర్ణేతలుగా జిల్లా షెడ్యూల్ కులాల సంక్షేమ అధికారి రజిత వ్యవహరించారు. మొదటి బహుమతి వీణ, స్రవంతి ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ వారికి, ద్వితీయ బహుమతి సౌమ్య జమున బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, తృతీయ బహుమతి ప్రియాంక పోస్టల్ శాఖ ఐడిఓసికి, నాలుగవ బహుమతి రాజ్యలక్ష్మి స్వప్న ట్రెజరీ డిపార్ట్మెంట్ వారికి అందజేశారు.
కార్యక్రమంలో పాల్గొన్న మహిళా ఉద్యోగుల ప్రతి ఒక్కరికి కన్సోలేషన్ బహుమతి అందజేశారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మహిళా ఉద్యోగులు అన్ని రంగాల్లో ముందు ఉండి జిల్లా కార్యాలయాల్లో వారి పనులను సంతృప్తికరంగా నిర్వహించుకుని మంచి పేరును తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో పాల్గొన్న మహిళా ఉద్యోగులకు అభినందనలు తెలిపారు.
కార్యక్రమంలో జిల్లా టిఎన్జీవోస్ సహ అధ్యక్షులు చక్రధర్, కోశాధికారి దేవరాజు ఉపాధ్యక్షులు యు. సాయిలు, లక్ష్మణ్, రాజ్యలక్ష్మి జాయింట్ సెక్రటరీ రాజమణి, ఆర్గనైజింగ్ సెక్రటరీ సంతోష్ కుమార్, ఈసీ నెంబర్లు సాయినాథ్ రంజిత్, దత్తాద్రి, అర్బన్ కార్యవర్గం నుండి శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షులు సృజన్ కార్యదర్శి పవన్ నితిన్ మహిళా ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.