డిపిఎంకు మెమో…

కామారెడ్డి, జూలై 29

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆగస్టు 8 తేదీ లోగా మహిళా సంఘాలకు 40 శాతం రుణాలు మంజూరు చేయాలని, స్త్రీ నిధి ద్వారా పాడి గేదెల రుణ సౌకర్యం కోసం మహిళా లబ్ధిదారులను గుర్తించాలని జిల్లా కలెక్టర్‌ ఎ.శరత్‌ ఆదేశించారు.

గురువారం కలెక్టరేట్‌ మీటింగ్‌ హాలులో జరిగిన స్వయం సహాయక సంఘాలు, మెప్మా, స్త్రీ నిధి ఋణాల మంజూరుపై అధికారులతో ఆయన మండలాల వారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాల ఋణ ప్రగతిలో పురోగతి సాధించాలని, వచ్చే నెల 8వ తేదీలోగా 40 శాతం ప్రగతి సాధించాలని డిపిఎం, ఏపీఎం, కమ్యూనిటీ కో ఆర్డినేటర్లను ఆదేశించారు.

క్షేత్రస్థాయిలో పని చేస్తేనే మంచి ఫలితాలు వస్తాయని, నిర్లక్ష్యం, అలసత్వంతో ప్రగతి సాధించని వారిపై చర్యలు ఉంటాయని, ఈనెల 31లోగా 33 శాతం ప్రగతి సాధించాలని ఆదేశించారు. లక్ష్య సాధనలో అలసత్వం ప్రదర్శించిన జుక్కల్‌ మండలం పెద్ద ఏడిగ గ్రామం, హంగర్గ క్లస్టర్‌లకు సంబంధించిన కమ్యూనిటీ కోఆర్డినేటర్‌ రామును సస్పెండ్‌ చేయాలని, డీపీఎంకు మెమో జారీ చేయాలని ఆదేశించారు.

మెప్మా మహిళా సంఘాల ఋణ ప్రగతి సంబంధించి, జిల్లాలోని 552 మెప్మా సంఘాలకు 33 కోట్ల 59 లక్షల లక్ష్యానికి గాను 169 సంఘాలకు 12 కోట్ల 69 లక్షలు అందించడం జరిగిందని, వచ్చే 8 వ తేదీలోగా 40 శాతం ఋణ ప్రగతి సాధించాలని ఆదేశించారు. స్త్రీ నిధి సంఘాలకు సంబంధించి 1040 గ్రూపులకు గారు 11 కోట్లు వివిధ రకాల జీవనోపాదుల క్రింద ఋణాలు మంజూరు చేయడం జరిగిందని, వచ్చేనెల 8 వ తేదీలోగా 30 శాతం ఋణ ప్రగతి సాధించాలని ఆదేశించారు.

స్త్రీ నిధి ద్వారా జిల్లాలో మహిళా గ్రూపునకు 93 వేల 270 రూపాయల ఖర్చుతో ఒక పాడిగేదె చొప్పున 2 వేల 500 మంది మహిళలకు పాడి గేదెల మంజూరు కోసం అర్బన్‌, గ్రామీణ ప్రాంతాలలో క్షేత్రస్థాయిలో అర్హులైన లబ్ధిదారులను వచ్చే నెల 8వ తేదీలోగా ఎంపిక చేయాలని స్త్రీ నిధి జోనల్‌ మేనేజరు ఆదేశించారు.

కార్యక్రమంలో జిల్లా లీడ్‌ అధికారి రాజేందర్‌ రెడ్డి, స్త్రీ నిధి జోనల్‌ మేనేజర్‌ రవి కుమార్‌, ఏపిడి సాయన్న, మెప్మా ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ శ్రీధర్‌ రెడ్డి, డిపిఎం, ఏపీఎం, కమ్యూనిటీ కోఆర్డినేటర్లు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »