కామారెడ్డి, జూలై 29
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డిలో గల గుమాస్తా కాలనీలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన యశ్మీన్ కుటుంబం గత కొన్ని రోజులుగా నివాసం ఉంటున్నారు. అయితే ఆమెకి పురిటి నొప్పులు రావడంతో 108 అంబులెన్స్‌కు ఫోను చేశారు. అంబులెన్స్ సిబ్బంది అక్కడికి చేరుకుని, తక్షణమే యాష్మీన్ (28) ని ఆసుపత్రికి తరలిస్తుండగా పురిటి నొప్పులు అధికం అవడంతో, మార్గ మధ్యలో (రామారెడ్డి రోడ్డు లో) అంబులెన్స్‌లో సుఖ ప్రసవం చేశారు.
రెండవ కాన్పులో పండంటి మగబిడ్డ జన్మించింది. తల్లి – బిడ్డ క్షేమంగా ఉన్నారని, తదుపరి వైద్య సేవల నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి, కామారెడ్డిలో చేర్పించారు. 108 అంబులెన్సు సిబ్బంది ఈఎంటి- సత్యం, పైలట్- రాజయ్య లను ఆమె భర్త మొహరం అలీ, కుటుంబ సభ్యులు అభినందించారు.