కామారెడ్డి, జనవరి 13
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం రక్తం అవసరమని తెలియజేయగానే వెంటనే స్పందించి తన జన్మదినం సందర్భంగా ఐవిఎఫ్ సభ్యులు కాపర్తి నాగరాజు తలసేమియా సికిల్ సెల్ సొసైటీలో సోమవారం రక్తదానం చేశారని, ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు తెలిపారు.
తలసేమియా వ్యాధితో బాధపడే చిన్నారులు తెలంగాణ రాష్ట్రంలో 20,000 మంది పైగా ఉన్నారని ప్రతి చిన్నారికి 20 రోజులకు ఒక యూనిట్ రక్తం జీవితాంతం అవసరం ఉంటుందని అలాంటి చిన్నారుల కోసం రక్తదానం చేయడానికి ముందుకు వచ్చిన కాపర్తి నాగరాజుకు ఐవీఎఫ్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా తరఫున అభినందనలు తెలిపారు.
తలసేమియా చిన్నారుల కోసం రక్తదానం చేయడానికి ముందుకు రావాలని ఒక్కసారి రక్తదానం చేయడం వల్ల తలసేమియా వ్యాధి చిన్నారి ప్రాణాలను 20 రోజులపాటు కాపాడవచ్చు అన్నారు.