లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో అన్నదానం

ఆర్మూర్‌, జూలై 30

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శుక్రవారం లయన్స్‌ క్లబ్‌ నవనాథపురం ఆధ్వర్యంలో లయన్స్‌ ఫాస్ట్‌ గవర్నర్‌ అంబాసిడర్‌ అవార్డు గ్రహీత డాక్టర్‌ జి. బాబురావు జన్మదిన సందర్బంగా ఆర్మూర్‌ ప్రభుత్వ వంద పడకల ఆసుపత్రిలో రెండువందల మందికి అన్న వితరణ చేశారు.

ఈ సందర్బంగా లయన్స్‌ క్లబ్‌ అధ్యక్షులు పుప్పాల శివరాజ్‌ మాట్లాడుతూ ఇంటర్నేషనల్‌ లయన్స్‌ క్లబ్‌లో తనదైన ముద్ర వేసుకుని అనేక సేవా కార్యక్రమాలలో పాల్గొని అనేక రకాల విరాళాలు ఇచ్చి తనదైన ముద్ర వేసుకున్నారని తెలిపారు. వారి అడుగుజాడల్లో ప్రతి లయన్స్‌ సభ్యుడు నడవాలని కోరారు.

కార్యక్రమంలో రీజినల్‌ చైర్మన్‌ సుదీర్‌ బాబూ, ప్రోగ్రాం చైర్మన్‌ ఎం.వెంకట్రామిరెడ్డి, కో చైర్మన్‌ డ్యాగా ఉదయ్‌, చెరుకు పృథ్వీరాజ్‌, హరి నారాయణ, లక్మి నారాయణ సామల, అంబల్ల తిరుపతి, శ్రీరాం సత్యనారాయణ, సామాజిక సేవకులు విజయ్‌ ఆనంద్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »