నిజామాబాద్‌లో పసుపు బోర్డు…

నిజామాబాద్‌, జనవరి 13

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

జాతీయ పసుపు బోర్డు నిజామాబాద్‌లో ప్రారంభోత్సవం చేయడంతో పాటు మొట్టమొదటి చైర్మన్‌గా తనపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, పార్లమెంట్‌ సభ్యులు ధర్మపురి అరవింద్‌ పెట్టిన నమ్మకాన్ని మమ్ము చేయకుండా తన శక్తి మేరకు పసుపు రైతుల అభివృద్ధికి నూతన వంగడాల ఏర్పాటుకు పసుపు రైతులకు ఎలాంటి కష్టాలు రాకుండా చూసుకోవడంతో పాటు బోర్డు ప్రతిష్ట నిలుపుటకై పని చేస్తానని జాతీయ పసుపు బోర్డు మొట్టమొదటి చైర్మన్‌ పల్లె గంగారెడ్డి అన్నారు.

మంగళవారం మకర సంక్రాంతి వేళ సూర్యుడు మకర రాశిలోకి ఉత్తరాయణంలోకి అడుగిడుతున్న సందర్భంగా తెలుగు నాట సంక్రాంతి సంబరాలలో భాగంగా నేటి జాతీయ పసుపు బోర్డు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని స్థానిక పసుపు రైతుల సమక్షంలో, నిఖిల్‌ సాయి హోటల్లో వర్చువల్‌గా కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ ప్రారంభించారు. పసుపు బోర్డ్‌ మొదటి చైర్మన్‌ పల్ల గంగారెడ్డిని అభినందిస్తూ… పసుపు బోర్డు నిజామాబాదులో ప్రధానమంత్రి 2023లో ఎన్నికల సందర్భంగా ప్రకటించిచారని, దానికి అనుగుణంగా మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిర్ణయం మేరకు నిజామాబాదులో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు అవుతుందని అన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ పసుపు బోర్డు ఏర్పాటు వల్ల దక్షిణ భారతదేశంలోని తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, ఒరిస్సా, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలలో పసుపు పంటపై రైతులకు ప్రోత్సాహంతో పాటు పలు కొత్త రకం వంగడాలను శాస్త్రవేత్తలు కనుగొంటారని, పంట సాగుకు అనేక రకాల ఇన్పుట్‌ సబ్సిడీస్‌, పసుపు ధరల స్థిరీకరణ మొదలగు అంశాలలో రైతులకు ఎంతో లాభం చేకూరుతుందని అన్నారు.

ఈ సందర్భంగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రులు బండి సంజయ్‌ మాట్లాడుతూ నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి సంజయ్‌ పట్టుబట్టి సాధించినది, జాతీయ పశు బోర్డు అని అన్నారు. నిజామాబాదులో జాతీయ పసువు బోర్డు ఏర్పాటు వల్ల తెలంగాణ ప్రజలకు భారతీయ జనతా పార్టీ మాటంటే కట్టుబడే పార్టీ అని రైతు సంక్షేమము శ్రేయస్సుకోసం పాటుపడే పార్టీ భారతీయ జనతా పార్టీ అని అన్నారు.

ఈ సందర్భంగా నిజామాబాద్‌ పార్లమెంట్‌ సభ్యులు ధర్మపురి సంజయ్‌ మాట్లాడుతూ దేశంలో ప్రధానమంత్రిగా మోడీ ఉంటే దేశ ప్రజలకు అన్ని ఉన్నట్లే అని అన్నారు. దేశంలో అతిపెద్ద కుంభమేళా ప్రయాగ్‌రాజ్‌లో ప్రారంభమైంది దానివల్ల ఆ ప్రదేశము ఆ ప్రాంతము ఆ రాష్ట్రము ఎంత అభివృద్ధికి నోచుకుంటుందో అదే విధంగా నేటి జాతీయ పశు బోర్డు నిజామాబాదులో ఏర్పాటు వల్ల అంతే అభివృద్ధిని పసుపు రైతులు, ఈ ప్రాంతం ఈ ప్రాంత ప్రజలు లబ్ధి పొందుతారని అన్నారు.

ఈ సందర్భంగా జాతీయ పశు బోర్డు మొట్టమొదటి బోర్డ్‌ చైర్మన్‌ పల్లె గంగారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతంలో పసుపును అత్యధికంగా పండిరచే ప్రాంతమైన నిజామాబాద్‌ జిల్లా నుండి పసుపు రైతుగా కాస్త నష్టాలు తెలిసిన నా వంటి ఓ సాధారణ రైతులు జాతీయ పశువుడు చైర్మన్‌ పదవికి నియామకం వేయాలంటే అది భారతీయ జనతా పార్టీ తన పార్టీ కార్యకర్తలకు ఇస్తున్న అతి గొప్ప గౌరవంగా భావిస్తున్నానని అన్నారు.

ఈ ప్రాంత పసుపు రైతుగా పసుపు అభివృద్ధికి నా వంతు కృషి చేయడంతో పాటు పసుపు ధర స్థిరీకరణకు, పసుపులో వచ్చే చీడ పీడల నుండి రక్షణకు శాస్త్రవేత్తల సహకారాలతో నూతన వంగడాలను అభివృద్ధి పరుచుటకు, బోర్డు ప్రతిష్టను దేశంలో పెంచేలా పనిచేస్తారని, నాపై పార్టీ, ప్రధానమంత్రి బండి సంజయ్‌ కుమార్‌, స్థానిక బిజెపి నాయకులు ఉంచిన నమ్మకాన్ని బాధ్యతతో మరింత శ్రద్ధతో పని చేస్తారని అన్నారు.

కార్యక్రమంలో నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే ధన్పాల్‌ సూర్యనారాయణ గుప్త, ఆర్మూర్‌ ఎమ్మెల్యే రాకేష్‌ రెడ్డి, నేషనల్‌ స్పైసీ బోర్డ్‌ కమిషనర్‌, నిజామాబాద్‌ పసుపు రైతులు, భారతీయ జనతా పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

మహిళలు ఎదగడానికి కుటుంబ సభ్యల సహకారం చాలా అవసరం..

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, జనవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహిళ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »