ఆర్మూర్, జనవరి 16
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ఆరోగ్య చైతన్య వేదిక ఆధ్వర్యంలో తేజ ఆసుపత్రి నిజామాబాద్ సహకారంతో ముద్రించిన నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆర్మూర్ మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ వివేకానంద్ రెడ్డిచే గురువారం ఆవిష్కరించినట్లు ఆరోగ్య చైతన్య వేదిక ఆర్మూర్ డివిజన్ కన్వీనర్ జక్కుల మోహన్ తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ప్రజారోగ్యంపై స్వచ్ఛందంగా అవగాహన కలిగించడం హర్షించదగిందని అన్నారు. కార్యక్రమంలో గంగాసాగర్ కార్యాలయ సిబ్బంది నవీన్, మనోజ్ తదితరులు పాల్గొన్నారు.