హైదరాబాద్, జనవరి 16
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
వీసా గడువు ముగిసి సౌదీ అరేబియాలో చిక్కుకున్న జగిత్యాల పట్టణానికి చెందిన కుక్కల చిన్న భీమయ్యను ఇండియాకు వాపస్ తెప్పించాలని అతని బ్యార్య గంగలక్ష్మి ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డికి మెయిల్ ద్వారా చేసిన విజ్ఞప్తికి ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) స్పందించింది. సాధారణ పరిపాలన శాఖ – ప్రవాసీ భారతీయుల విభాగం (జీఏడి – ఎన్నారై) ముఖ్య కార్యదర్శి ఎం. రఘునందన్ రావు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ద్వారా ఢల్లీిలోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు, సౌదీ అరేబియా రియాద్‌లోని భారత రాయబార కార్యాలయానికి ‘వైర్ మెసేజ్’ పంపారు.
భీమయ్య కుమారుడు సునీల్ కు ‘బోన్ మారో’ (ఎముక మూలుగు) మార్పిడి చికిత్సకు దాతగా భీమయ్యను సౌదీ నుంచి అత్యవసరంగా తెప్పించాల్సి ఉంది. ఇదిలా ఉండగా కాంగ్రేస్ ఎన్నారై సెల్ కన్వీనర్ మంద భీంరెడ్డి ‘ఎక్స్’ లో చేసిన విజ్ఞప్తికి రియాద్ లోని ఇండియన్ ఎంబసీ స్పందించింది. సౌదీలోని సామాజిక సేవకులు గాజుల నరేష్, మీర్జా బేగ్, మహ్మద్ ఫారూఖ్ అహ్మద్‌లు స్థానిక అధికారులతో, ఇండియన్ ఎంబసీతో సమన్వయం చేస్తున్నారు.