కామారెడ్డి, జనవరి 16
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
రేషన్ కార్డుల సర్వే, ఇందిరమ్మ ఇండ్ల సర్వే పక్కాగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ (రెవిన్యూ) వి.విక్టర్ అన్నారు. గురువారం దోమకొండ మండలం చిత్తమాన్ పల్లి, బీబీపెట్ మండలం తుజల్పూర్ గ్రామాలలో రేషన్ కార్డుల సర్వే, ఇందిరమ్మ ఇండ్ల సర్వే ల తీరును ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిజమైన లబ్ధిదారులకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా సర్వే పనులు చేపట్టాలని అన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా సర్వే పనులు కొనసాగించాలని తెలిపారు. అదనపు కలెక్టర్ వెంట రెవిన్యూ, పంచాయతీ అధికారులు పాల్గొన్నారు.