ఆర్మూర్, జూలై 30
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శుక్రవారం ఆర్మూర్ మున్సిపల్ 5వ వార్డ్ పరిధిలోని కోటర్మూర్ ప్రాథమిక పాఠశాలలో ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణి కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా స్థానిక కౌన్సిలర్ బండారి ప్రసాద్, 24 వ వార్డ్ కౌన్సిలర్ ఆకుల రాము హాజరై విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశారు.
ఈ సందర్బంగా కౌన్సిలర్ ప్రసాద్ మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం ప్రాథమిక విద్యకు పెద్దపీట వేస్తున్నదని కరోన సమయంలో ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తూ విద్యార్థులు సురక్షితంగా ఉంటూ చక్కటి విద్య నేర్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు గీతాంజలి, ఉపాద్యాయులు, ఎస్ఎంసి చైర్మన్ పాల్గొన్నారు.