బాన్సువాడ, జనవరి 19
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో ఆడి జాతీయ అంతర్జాతీయ స్థాయికి ఎదిగి బాన్సువాడకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషణ్ చైర్మన్ కాసుల బాలరాజు అన్నారు. ఆదివారం బాన్సువాడ మండలంలోని కొత్తబాద్ గ్రామంలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్ సహకారంతో నిర్వహించిన కేపీఎల్ క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్‌లో కొత్తబాధ్, బాన్సువాడ జట్లు తలపడగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన కొత్తబాధ్ క్రికెట్ జట్టు ఫైనల్లో గెలుపొందడంతో రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్ విజేత జట్టుకు 25000, ద్వితీయ స్థానం సాధించిన జట్టుకు 15,500, అందజేసి కప్ లను అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ గ్రామీణ స్థాయిలో క్రీడా పోటీలు నిర్వహించడం ద్వారా గ్రామీణ స్థాయి క్రీడాకారుల నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు క్రికెట్ టోర్నిలు ఎంతో దోహదపడతాయన్నారు. క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని ఓటమి గెలుపుకు నాందిగా స్ఫూర్తిగా తీసుకొని అందుకు అనుగుణంగా క్రీడలో రాణించి మున్ముందు జాతీయ అంతర్జాతీయ స్థాయికి ఎదగాలన్నారు.
క్రీడల్లో బాన్సువాడ కు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని తన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. విజేతగా నిలిచిన కొత్తబాద్ జట్టును ఆయన అభినందించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్, కాంగ్రెస్ నాయకులను శాలువతో ఘనంగా సత్కరించారు.
కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి, నాయకులు ఏజాస్, ప్రదీప్ పటేల్, అసద్ బిన్ మోసిన్, రాయిస్, సాయి రెడ్డి,మాజీ సర్పంచ్లు అంకిత సాయ గౌడ్, సాయిలు, జిన్నా రఘు,రేంజర్ల సాయిలు, శ్రీనివాస్, సలీం, కళ్యాణ్, షాదుల్, వినోద్, చిన్న, షోయెబ్, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.