నందిపేట్, జనవరి 20
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
నందిపేట్ మండల కేంద్రంలో ఆదివారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థులు స్వర్ణోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ పాఠశాలలో 1974-నుంచి 2024 సంవత్సరం వరకు చదువుకున్న పూర్వ విద్యార్థులందరూ ఉత్సహంగా వేడుకలు జరుపుకున్నారు.
అప్పటి నుంచి ఈ పాఠశాలలో చదువుకొని ఉన్నత స్థాయిలో చదువుకున్న వారందరిని సన్మానించారు. పూర్వ విద్యార్థులు తమ అభిరుచులు పంచుకున్నారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మండల విద్యాధికారి అవధూత గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.