గణతంత్ర దినోత్సవ వేడుకలకు విస్తృత ఏర్పాట్లు

నిజామాబాద్‌, జనవరి 20

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్‌ హాల్‌ లో సోమవారం అన్ని శాఖల అధికారులతో కలెక్టర్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. నిజామాబాద్‌ పోలీస్‌ పరేడ్‌ మైదానంలో జరిగే రిపబ్లిక్‌ డే వేడుక సందర్భంగా చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి ఆయా శాఖల వారీగా అధికారులకు దిశానిర్దేశం చేశారు.

వీటితోపాటు గృహాజ్యోతి, రూ. 500లకే గ్యాస్‌ సిలిండర్‌, రైతు రుణ మాఫీ, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, రాజీవ్‌ ఆరోగ్యశ్రీ వంటి పథకాల ప్రాధాన్యతను చాటేలా శకటాలను ప్రదర్శించాలని సంబంధిత జిల్లా అధికారులను ఆదేశించారు. వ్యవసాయ, ఉద్యానవన, జిల్లా గ్రామీణాభివృద్ధి, పశు సంవర్ధక, విద్య, వైద్యం, స్త్రీ శిశు సంక్షేమం, ఫిషరీస్‌, ఇరిగేషన్‌ తదితర శాఖల పనితీరును చాటేలా స్టాల్స్‌ ఏర్పాటు చేయాలని సూచించారు.

ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు అందించేందుకు గాను శాఖల వారీగా పరిమితితో కూడిన ప్రతిపాదనలు పంపించాలని అన్నారు. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో సమర్ధవంతంగా విధులు నిర్వహించిన సిబ్బందికి ప్రాధాన్యతనిస్తూ, ఈ నెల 22వ తేదీ లోగా పేర్లను ప్రతిపాదనల రూపంలో సిఫార్సు చేయాలని అధికారులకు సూచించారు. గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని ట్రాన్స్కో అధికారులను ఆదేశించారు. దేశభక్తిని చాటేలా విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సూచించారు.

సమావేశంలో అదనపు కలెక్టర్లు అంకిత్‌, కిరణ్‌ కుమార్‌, ట్రైనీ కలెక్టర్‌ సంకేత్‌ కుమార్‌, అదనపు డీసీపీ బస్వారెడ్డి, డీఆర్డీఓ సాయాగౌడ్‌, నిజామాబాద్‌ ఆర్డీఓ రాజేంద్ర కుమార్‌, కలెక్టరేట్‌ ఏ.ఓ ప్రశాంత్‌, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.

Check Also

ఆగ్రోస్‌ భూములను కాపాడడమే నా లక్ష్యం…

Print 🖨 PDF 📄 eBook 📱 హైదరాబాద్‌, జనవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »