కామారెడ్డి, జనవరి 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలో సాత్విక (13) అనీమియా వ్యాధితో బాధపడుతుండడంతో అత్యవసరంగా రెండు యూనిట్ల ఓ పాజిటివ్ రక్తం అవసరం కావడంతో వారి కుటుంబ సభ్యులు ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలును సంప్రదించారు. వారికి కావాల్సిన రక్తాన్ని జీడిపల్లి శ్రీనివాస్ రెడ్డి సహకారంతో ఓ పాజిటివ్ రక్తాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారికి మానవతా దృక్పథంతో రక్తాన్ని అందజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉందని, మనం ఎప్పుడైతే ఇతరులకు సహాయం చేస్తామో మనకు ఆపద ఎదురైనప్పుడు ఎవరో ఒకరు ఒకరు సహాయం చేయడానికి రావడం జరుగుతుందన్నారు.
సకాలంలో రక్తాన్ని అందజేయకపోతే ప్రాణాలను కూడా కోల్పోయే పరిస్థితులు ఏర్పడతాయని అన్నారు. గతంలో తలసేమియా చిన్నారుల కోసం రక్తదానం చేయడమే కాకుండా ఈ రోజు ఆపదలో ఉన్న బాలికకు సకాలంలో రక్తాన్ని అందజేసిన జీడిపల్లి శ్రీనివాస్ రెడ్డికి ఐవీఎఫ్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా తరఫున అభినందనలు తెలిపారు. రక్తదానం చేయాలనుకున్న వారు వారి యొక్క వివరాలను 9492874006 నెంబర్ కి సంప్రదించాలని అన్నారు.