ఎల్లారెడ్డి, జనవరి 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ఎల్లారెడ్డి పట్టణంలోని కెవికే ఫంక్షన్ హాల్లో బుధవారం వికలాంగుల ఉపకరణముల ఎంపిక శిబిరం అలీమ్ కో హైదరాబాదు, జిల్లా సంక్షేమ అధికారి ఆధ్వర్యంలో నిర్వహించారు. శిబిరానికి ఎల్లారెడ్డి నియోజకవర్గం లోని 587 మంది వివిధ రకాల వైకల్యము కల వికలాంగులు హాజరైనారు.
శిబిరములో ఎంపిక చేయబడిన వికలాంగులకు అలింకో కంపెనీ ద్వారా ఉచితముగా ఉపకారణాల పంపిణీ చేయబడుతుందని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్, జిల్లా సంక్షేమ అధికారి ప్రమీల, ఎల్లారెడ్డి సిడిపివో, సూపర్వైజర్లు, జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.