నిజామాబాద్, జనవరి 23
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
సాంఘిక సంక్షేమ ఇతర గురుకుల వసతి గృహాలలో విద్యార్థిని విద్యార్థులకు సమకూర్చే భోజనం మెనూ ప్రకారము నాణ్యతను విస్మరించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ ప్రత్యేక కార్యదర్శి శ్రీమతి యోగితారాణ హెచ్చరించారు.
నిజామాబాద్ జిల్లా ధర్మారం గ్రామంలోని సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల, పాఠశాల ను రాష్ట్ర విద్యాశాఖ ప్రత్యేక కార్యదర్శి శ్రీమతి యోగితా రాణ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కళాశాల పాఠశాల ఆవరణలో మొత్తము తిరిగి పరిసరాలను పరిశుభ్రతను పరిశీలించారు. అలాగే విద్యార్థుల కు బోధన పద్ధతులు,తీరును సమీక్షించారు. పాఠశాల కళాశాలలో మూత్రశాలల, మరుగుదొడ్ల నిర్వహణ, వసతి గృహం నిర్వహణ, విద్యా బోధన ప్రమాణాల, భోజన మెనూ ప్రకారం నిర్వహణ, రిజిస్టర్ల నిర్వహణ, తరగతుల నిర్వహణ తదితర అంశాల పై పరిశీలన సమీక్ష నిర్వహించారు.
తాగునీటి వసతి, ప్రత్యేక తరగతుల నిర్వహణ ఉదయం, రాత్రి వేళలో నిర్వహిస్తున్న విద్య బోధన ప్రత్యేక తరగతుల నిర్వహణ, వ్యాయామం నిర్వహించడం తదితర అదనపు కార్యక్రమాల నిర్వహణపై సమీక్షించారు. కళాశాలస్థాయిలో ప్రయోగశాలల నిర్వహణ, సీ. సి. కెమెరాలు పనితీరు ను స్వయంగా పరిశీలించారు.
కార్యక్రమంలో జిల్లా ఇంటర్ విద్యా అధికారి తిరుమలాపూడి రవికుమార్, పాఠశాల స్థాయి జిల్లా విద్య అధికారి అశోక్, మండల ఎంఈఓ, కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా యోగితా రానా మధ్యాహ్న భోజనం విద్యార్థులతో కలిసి చేశారు.
ఈ సందర్భంగా జిల్లా ఇంటర్ విద్యా అధికారి రవికుమార్, జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్ ల సంఘం అధ్యక్షులు చిన్నయ్య, ప్రభుత్వ జూనియర్ అధ్యాపకుల సంఘం జిల్లా అధ్యక్షుడు నర్సయ్య లు పేద విద్యార్థులకు అందజేయడం కోసం నోట్ ఋక్కులను విద్యాశాఖ ప్రత్యేక కార్యదర్శి యోగతరాణకు అందజేశారు.